కరోనా మహమ్మారి.. బ్రిటన్ ఆరోగ్య మంత్రిని వదల్లేదు..

శుక్రవారం, 27 మార్చి 2020 (21:22 IST)
కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించింది. కరోనా వైరస్ కారణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కరోనా కాటేసే వారి సంఖ్య మాత్రం పెరుగుతూ పోతోంది. ఇప్పటికే కరోనా వైరస్ చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ ఆవహిస్తుంది. 
 
ఇందులో ఇప్పటికే యువరాజు చార్లెస్, ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా బారినపడ్డారు. అలాగే బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ని కూడా కరోనా సోకింది. ఇది చాలదన్నట్లు.. కరోనా వైరస్ భూతం బ్రిటన్‌లో ప్రముఖులను కరోనా కాటేస్తోంది.
 
తాజాగా ఈ జాబితాలో బ్రిటన్ ఆరోగ్యమంత్రి మాట్ హేంకాక్ కూడా చేరారు. వైద్యుల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నానని, ఆ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని హేంకాక్ ట్విట్టర్‌లో వెల్లడించారు. అదృష్టవశాత్తు తీవ్ర లక్షణాలేవీ లేవని, దాంతో స్వీయనిర్బంధంలో ఉంటూ ఇంటి నుంచే పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇంట్లోనే ఉండడం ద్వారా ఇతరుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు