మలేషియా కోలాలంపూర్‌లో శ్రీలంక రాయబారిపై దాడి జరిగింది. ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటైన కౌలాలంపూర్‌లో శ్రీలంక రాయబారి ఇబ్రహిం సాహిబ్ అన్సార్‌పై దుండగులు దాడి చేశారు. ఎయిర్ పోర్టులో భారీ భద్రత ఉన్నా.. శ్రీలంక రాయబారిపై దాడి జరగడం దారుణమని ప్రయాణీకులు మండిపడుతున్నారు. రాయబారిపై దాడి చేయడంపై శ్రీలంక విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇంకా పోలీసులు ఉన్న చోటే విదేశీ రాయబారికి భద్రత లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దీంతో ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు దుండగులను చితకబాది అదుపులోకి తీసుకున్న ఘటన చర్చనీయాంశమైంది. ఇకపోతే... శ్రీలంకపై దాడికి సంబంధించిన కెమెరాకు చిక్కాయి. దీంతో అసలు విషయం బయటపడింది. శ్రీలంక రాయబారిపై దాడి చేసిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మలేషియాలో శ్రీలంక హైకమిషనర్‌గా పనిచేస్తున్న అన్సర్‌పై నిరసనకారులు దౌర్జన్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆయనను చుట్టుముట్టిన నలుగురైదుగురు వ్యక్తులు పిడిగుద్దులు కురిపిస్తూ.. దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. ఈ దాడిలో ఆయనకు స్వల్పగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై శ్రీలంక ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశంలోని మలేషియా రాయబారికి సమన్లు జారిచేసి.. తమ నిరసన తెలియజేసింది.