నిత్యావసర సరుకుల ధరలు ఐదు నుంచి పది రెట్లు పెరిగాయి. గ్యాస్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ నిల్వలు దాదాపు నిండుకుపోయాయి. ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో పెట్రోలు కోసం వేర్వేరు క్యూలలో నిల్చున్న ఇద్దరు వ్యక్తులు కుప్పకూలి మరణించారు.
దేశంలో ఇప్పుడు ఓ కోడిగుడ్డు రూ.35 పలుకుతుండగా, కిలో చికెన్ రూ. 1000 పైమాటే. పెట్రోలు, డీజిల్, కిరోసిన్ ధరలైతే అందకుండా పోయాయి.
లీటరు పెట్రోలు ప్రస్తుతం రూ. 283గా ఉండగా, డిజిల్ రూ. 220గా ఉంది. డాలర్‌తో పోలిస్తే శ్రీలంక కరెన్సీ విలువ రూ. 270కు పడిపోయింది. ఇక, కరెంటు ఊసే లేకుండా పోయింది.