మెదడుపై దాడి చేసి చంపేసే అమీబా.. బాలుడు అలా చనిపోయాడు..

గురువారం, 30 సెప్టెంబరు 2021 (10:51 IST)
amoeba
కరోనా వైరస్‌ దెబ్బ నుంచి ప్రపంచం కోలుకోకముందే.. మరో సూక్ష్మజీవి ప్రజలను భయానికి గురిచేస్తోంది. ఈ వైరస్ నేరుగా మెదడుపై దాడి చేసి చంపేస్తోంది. అదేంటో తెలుసా..'అమీబా నెగ్లేరియా ఫోవ్‌లేరి.. అమీబా జాతికి చెందిన సూక్ష్మజీవి ఇది. అప్పట్లో దీని ప్రభావంతో భయపడిపోయిన ప్రజల్లో మళ్లీ వణుకు మెుదలైంది.
 
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని టెక్సాస్‌లో ఆర్లింగ్టన్ డాన్ మిసెన్‌హైమర్ పార్క్‌లో ఓ పిల్లాడు ఆడుకుంటున్నాడు. స్ప్రింక్లర్లు, ఫౌంటైన్‌లు, నాజిల్‌లు,నీటిని పిచికారీ చేసే ఇతర సామాగ్రి ఉంటాయక్కడ. అయితే వీటి ద్వారా అమీబా నెగ్లేరియా ఫోవ్‌లేరి సూక్ష్మ జీవి ఆ బాలుడి మెదడులోకి ప్రవేశించింది. అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే బ్రేయిన్-ఈటింగ్ అమిబా ఆ బాలుడి(7)లోకి ప్రవేశించినట్టు వైద్యులు చెప్పారు. 
 
దాని కారణంగా తలనొప్పి, వాంతులు లాంటి లక్షణాలతో పిల్లాడు చనిపోయాడు. సెప్టెంబర్ 5న అరుదైన ఇన్ఫెక్షన్ కారణంగా పిల్లలు ఆసుపత్రిలో చేరినట్లు కూడా అధికారులు గుర్తించారు. కలుషితమైన నీరు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తే.. అమీబా నెగ్లేరియా ఫోవ్‌లేరి సోకి.. మరణిస్తారని వైద్యులు చెబుతున్నారు. సురక్షితమైన నీటిలో ఉండాలని.. వేడి నీటిని తాగాలని సూచిస్తున్నారు.
 
ఈ అమీబా నెగ్లేరియా ఫోవ్‌లేరి సాధారణంగా కాల్వలు, చిన్ని చిన్న మురికి గుంటలు, అపరిశుభ్ర స్విమ్మింగ్‌ పూల్స్‌, తాగునీటి కుళాయిల ఉంటాయి. తాజాగా చనిపోయిన పిల్లాడికి కూడా పార్క్ లోని నీటి ద్వారా సోకినట్లు తెలుస్తోంది. గార్డెన్‌లో ఆడుకుంటుండగా స్ప్రింక్లర్‌లోని నీరు బాలుడిపై పడి వ్యాధి వచ్చినట్టు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు