చిన్నారులకు సెల్‌ఫోన్లు బంద్.. చైనా కఠిన ఆంక్షలు

గురువారం, 3 ఆగస్టు 2023 (12:58 IST)
ఆధునిక ప్రపంచంలో సెల్‌ఫోన్లు అనివార్యంగా మారాయి. చిన్నపిల్లల నుంచి అందరూ స్మార్ట్‌ ఫోన్లు వాడుతున్నారు. పిల్లలు ఎక్కువసేపు సెల్‌ఫోన్‌లు వాడుతున్న కారణంగా వారిలో నిద్రలేమి గురవుతున్నారు. అందువల్ల పిల్లలకు సెల్‌ఫోన్లు ఇవ్వవద్దని వైద్యులు సూచించారు. 
 
ఈ స్థితిలో చిన్నారులు సెల్‌ఫోన్లు వాడకుండా చైనా కఠిన ఆంక్షలు విధించింది. ఇందుకు సంబంధించి చైనా సెల్‌ఫోన్ నియంత్రణ మండలి నిబంధనలను రూపొందించింది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు రోజుకు గరిష్టంగా 2 గంటలు మాత్రమే సెల్‌ఫోన్‌లను ఉపయోగించడానికి అనుమతించాలి. 
 
8 ఏళ్లలోపు పిల్లలకు రోజుకు 40 నిమిషాలు, 8 నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు ఒక గంట, 16 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలకు 2 గంటల సెల్‌ఫోన్‌ వినియోగించేందుకు అనుమతిస్తారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య 18 ఏళ్లలోపు వారికి ఎలాంటి స్మార్ట్‌ఫోన్ సేవలు అందించకూడదు. 
 
18 ఏళ్లలోపు వారు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య మొబైల్ పరికరాల్లో ఇంటర్నెట్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని సైబర్ బేస్ పేర్కొంది. పిల్లల వయస్సును ధృవీకరించే పరికరాన్ని కూడా స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు