ఆసియా దేశాలు మాకో లెక్క కాదు.... ఖండాలు దాటి కూడా తుక్కుతుక్కు చేస్తాం... అమెరికాకు చైనా వార్నింగ్

మంగళవారం, 26 జులై 2016 (14:22 IST)
చైనా అగ్రదేశం అమెరికాకు హెచ్చరికలు చేస్తోంది. దక్షిణ సముద్రం లడాయి వ్యవహారం అటు అమెరికా ఇటు చైనా మధ్య ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఒకవేళ దక్షిణ సముద్రాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తే దాడి చేసేందుకు సౌత్ కొరియాలో 'థాడ్' యాంటీ మిసైల్ సిస్టమ్‌ను అమెరికా మోహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చైనా తమ వద్ద అంతకుమించి శక్తివంతమైన మిసైళ్లు ఉన్నాయనీ, అవి ఖండాలను దాటి వెళ్లి లక్ష్యాలను ఛేదించగలవని ఓ వీడియో ద్వారా చూపించింది. 
 
ఇప్పుడు కాదు.... ఆరు సంవత్సరాల క్రితమే ఇలాంటివి తాము రూపొందించుకున్నామనీ, పక్కనే ఉన్న భారత్, పాక్ తదితర ఆసియా దేశాలు తమకో లెక్క కాదనీ, ఖండాంతారాలు దాటి మరీ అక్కడి లక్ష్యాలను ఛేదించే సత్తా ఉన్నదంటూ ఆ వీడియోలో తెలిపినట్లు అక్కడి రేడియోలో ఓ కథనం వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఇంతకుమునుపు కూడా చైనా ఇలాంటి పరీక్షలు చేసిందని చెప్పుకున్నా... దానిపై చైనా స్పందించలేదు.

వెబ్దునియా పై చదవండి