ఇటీవలికాలంలో సోషల్ మీడియా సెలెబ్రిటీ కావడానికి చిత్రవిచిత్రమైన ఫీట్లు చేస్తున్నారు యూత్. అలాంటి ఫీటే ఇది. సాధారణంగా శీతలపానీయాన్ని (కూల్‌డ్రింక్స్) తాగాలంటే చిన్న గ్లాసులోగానీ లేదా చిన్న బాటిల్‌లో పోసుకుని తాగుతుంటాం. పైగా, ఒక గుటక వేసిన కొద్దిసేపు తర్వాత మరో గుటక వేస్తుంటారు. చిన్నబాటిల్ అయినప్పటికీ.. ఒకేసారి బాటిల్‌లో ఉండే మొత్తం కూల్‌డ్రింక్‌ను తాగలేం.
కానీ, ఈ చైనా కుర్రోడు మాత్రం ఏకంగా మూడు లీటర్ల శీతలపానీయాన్ని గటగటా తాగేశాడు. అదీ కూడా ఒక్కటంటే ఒక్క నిమిషంలో. 3 లీటర్ల కూల్‌డ్రింక్స్ బాటిల్స్‌ను ఒక నిమిషం 7 సెకండ్లలో దాదాపు 3 లీటర్ల కూల్ డ్రింక్‌ను తాగి రికార్డు సృష్టించాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియోను మీరూ చూడండి.