బ్రెజిల్: టూత్ బ్రష్‌లను పొడుచుకున్నారు.. 15 మంది ఖైదీలు మృతి

సోమవారం, 27 మే 2019 (15:16 IST)
బ్రెజిల్ దేశంలోని జైలులో ఖైదీల మధ్య ఏర్పడిన ఘర్షణ 15 మంది ప్రాణాలను బలితీసుకుంది. బ్రెజిల్ లోని అమెజొనాస్ రాష్ట్రంలోని ఓ జైల్లో ఖైదీలు రెండు గ్రూపులుగా విడిపోయి చేతికి అందినవాటితో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 15 మంది ఖైదీలు మృతి చెందారు. టూత్ బ్రష్షులతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడిన ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
టూత్ బ్రష్‌లతో పొడుచుకోవడం.. గొంతును నులిమేయడం చేశారు. దీంతో జైలు అధికారులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో గాయపడిన వారిని అధికారులు ఆస్పత్రికి తరలించారు. కాగా బ్రెజిల్‌లోని జైళ్లు.. ప్రపంచంలోనే మూడో వరుసలో అత్యధిక ఖైదీలను కలిగివుంది. జైళ్లల్లో మగ్గుతున్న వారి సంఖ్య జూన్ 2016 నాటికి 726,712 మందికి చేరిందని అధికారులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు