ఆఫ్రికా దేశంలో మారణకాండ- 600 మందిని కాల్చిపారేశారు..

సెల్వి

శనివారం, 5 అక్టోబరు 2024 (12:02 IST)
Africa
ఆఫ్రికా దేశంలో మారణకాండ కొనసాగుతోంది. బుర్కినా ఫాసోలో భయానక ఘటన వెలుగు చూసింది. బర్సాలోగో పట్టణంలో అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ అనుబంధ ఉగ్రసంస్థ జమాత్‌ నుస్రత్‌ అల్‌ ఇస్లామ్‌ వాల్‌ ముస్లిమిన్‌ మిలిటెంట్లు కిరాతకానికి పాల్పడ్డారు. 
 
గంటల వ్యవధిలోనే దాదాపు 600 మందిని కాల్చిపారేశారు. ఆగస్టు 24న జరిగిన ఈ మారణహోమం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైక్‌లపై వచ్చిన ఉగ్రవాదులు కనిపించిన వారిని పిట్టల్లా కాల్చి చంపేశారు. మృతుల్లో అత్యధికంగా మహిళలు, చిన్నారులే వుండటం గమనార్హం. 
 
ప్రాణ భయంతో ప్రజలు పరుగులు పెట్టినా వదిలిపెట్టలేదని.. వారిని వెంబడించి మరీ కాల్పులు జరిపినట్లు తెలిపింది. తొలుత ఈ ఘటనలో 200 మంది మరణించినట్లు ఐరాస అంచనా వేసింది. కానీ, 600 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు