సోషల్ మీడియా ప్రభావం యువతపై బాగానే కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్లను చేతబట్టుకుని ఎక్కడపడితే అక్కడ చాటింగ్‌లు, వీడియో గేమ్‌లు ఆడుకుంటూ ప్రస్తుత యువత సమయాన్ని వృధా చేస్తోంది. ఆ వీడియో గేమ్సే తాజాగా ఓ యువకుడి ప్రాణాలపైకి తెచ్చింది. వివరాల్లోకి వెళితే.. ''పోకేమాన్ గో" ఆటలో నిమగ్నమై పరిసరాలను మరచిపోయిన 20 ఏళ్ల యువకుడిని ఓ దుండగుడు కాల్చిచంపాడు. ఈ ఘటన గన్ కల్చర్ పెరిగిపోతున్న అమెరికాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో వీడియో గేమ్స్ ఆడుతూ ఓ యువకుడు బుల్లెట్‌కు బలైయ్యాడు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆదివారం రాత్రి ఈ ఘటన చేటుచేసుకుంది. పర్యాటకులు అధికంగా వచ్చే వాటర్‌ఫ్రంట్ ప్రాంతంలోని ఘిరాడెల్లీ స్క్వేర్ వద్ద కాల్విన్ రైలీ అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగుడు తుపాకీతో కాల్చి చంపినట్టు యూఎస్ పార్క్ పోలీసులు తెలిపారు.