పూర్తిగా కోలుకున్న బ్రిటన్ ప్రధాని... ఇపుడు ఆ ఒక్కదానిపైనే ఫోకస్

శనివారం, 25 ఏప్రియల్ 2020 (11:56 IST)
కరోనా వైరస్ బారినపడి... మృత్యువు అంచులకు చేరి తిరిగి కోలుకున్న వారిలో బ్రిటన్ ప్రదాని బోరిస్ జాన్సన్ ఒకరు. ఈయన ఇపుడు పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇపుడు ఒకే ఒక అంశంపై దృష్టి కేంద్రీకరించారు. అదే కరోనా వైరస్ మహమ్మారిని తిరిమికొట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. 
 
కోవిడ్ బారినపడిన దేశాల్లో బ్రిటన్ ఒకటి. ఈ దేశంలో కూడా కరోనా వైరస్ కరాళ నృత్యం చేసింది. దీంతో బ్రిటన్ రాణి దంపతులను కూడా మరో ప్రాంతానికి తరలించారు. అదేవిధంగా కరోనా వైరస్ నుంచి కోలుకున్న బోరిస్ జాన్సన్ ఇపుడు కరోనా వైరస్ కట్టడిపైనే దృష్టిని కేంద్రీకరించారు. 
 
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ నుంచి వేటికి మినహాయింపు ఇవ్వాలనే ఒత్తిడి ఆయన ప్రభుత్వంపై క్రమంగా పెరుగుతోంది. దీంతో లాక్‌డౌన్‌ సడలింపు లేదా ఎత్తివేయడంపై ఆయన ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటికే ఆయన ప్రభుత్వ బాధ్యతల్లో నిమగ్నమైనట్టు సమాచారం. 
 
ప్రస్తుతం ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని చెకర్స్‌ (బ్రిటన్‌ ప్రధాని నివాసం)లో ఉంటున్నారు. అక్కడి నుంచే ఆయన బ్రిటన్‌ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి డొమినిక్‌ రాబ్‌తోపాటు ఇతర మంత్రివర్గ సహచరులకు మార్గనిర్దేశం చేస్తున్నారని, మరికొద్ది రోజుల్లో పూర్తిస్థాయి విధులు నిర్వర్తించేందుకు జాన్సన్‌ సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. 
 
55 ఏళ్ల బోరిస్ జాన్సన్.. ఏప్రిల్ 12న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.. మూడు రోజులు ఇంటెన్సివ్ కేర్‌లో గడిపిన ఆయన.. తర్వాత కోలుకున్నారు.. ఇంటికి చేరుకున్నారు.. అతను క్వీన్ ఎలిజబెత్ 2, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కూడా మాట్లాడినట్లు అధికారులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు