కరోనాతో ఇప్పటివరకు ఇండోనేషియాలో 373 మంది మరణించారు. 4241 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా ఇండోనేషియాలోని మారుమూల గ్రామాల్లో కరోనా గురించి అవగాహన లేనివారు నేటికీ వీధుల్లో సంచరిస్తున్నారు. ఇక వారికి ఎంత చెప్పినా వైరస్‌పై అవగాహన రావట్లేదు. అంతేకాదు వైరస్ గురించి హెచ్చరించినా వారు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇండోనేషియాలోని కెపూ గ్రామానికి చెందిన యువకులు ప్రజలను భయపెట్టే పనిలో పడ్డారు. దెయ్యాలు తిరుగుతున్నాయని చెప్పి వినూత్న ప్రయోగానికి తెరతీశారు.