కరోనా దేశాధ్యక్షులనూ వదలడం లేదు. ఇప్పటికే పలువురు నేతలను ఆసుపత్రి పాలు చేసిన ఈ మాయదారి మహమ్మారి.. తాజాగా బొలీవియా తాత్కాలిక అధ్యక్షురాలు జీనిన్ అనెజ్ ను ఆవహించింది.
ఈ మేరకు ఆమె తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రకటించారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, ఐసోలేషన్‌లో ఉండి పని చేయనున్నట్లు తెలిపారు.
ఆమె మంత్రివర్గంలోని నలుగురికి కూడా ఈ మధ్యే పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆమె పరీక్షలు చేసుకోగా తనకు కూడా వైరస్ సోకినట్లు తేలింది.
దీంతో కరోనా బారిన పడ్డ దేశాధ్యక్షుల సంఖ్య రెండుకు చేరింది. ఇంతకుముందు బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారోకు కరోనా సోకింది.