తొలిరోజు మూడు జిల్లాల్లో ఆరేడు వందల మందికి పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లో 50 అర్బన్ హెల్త్ సెంటర్లు, రంగారెడ్డిలో 20, మేడ్చల్‌లో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పరీక్షలు చేయనున్నారు.
కరోనా లక్షణాలు ఉన్నవారికి, పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారికి ముక్కు, గొంతు స్రావాలు(స్వాబ్) సేకరిస్తారు. ప్రత్యేక కిట్ సాయంతో చేసే పరీక్షల్లో 30 నిమిషాల్లోనే ఫలితం వస్తుంది.