కరోనా ఎఫెక్ట్, ఆ దేశంలో పది రూపాయలకే గర్ల్ ఫ్రెండ్..?

మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (18:47 IST)
చైనాలో ఒక షాపింగ్ మాల్ యువకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 10 రూపాయలకే గర్ల్ ఫ్రెండ్స్‌ని అద్దెకు పంపిస్తోంది. హ్యువాన్ సిటిలో ది విటాలిటి సిటీ షాపింగ్ మాల్ ఒంటరిగా వచ్చే యువకులకు అద్దెకు గర్ల్ ఫ్రెండ్స్‌ని అందుబాటులో ఉంచింది. షాపింగ్ కోసం అమ్మాయి తోడుగా కావాలంటే అద్దెకు తీసుకోవచ్చు. 20 నిమిషాలకు రూ. 10 చెల్లిస్తే చాలు. కస్టమర్ల సంఖ్యను పెంచేందుకు ఇలా అద్దెకు గర్ల్ ఫ్రెండ్స్‌ని ఏర్పాటు చేసింది.
 
ఇదొక వాదనైతే చైనాలో కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో షాపింగ్ మాల్‌కు ఎవరూ రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనం అస్సలు బయటతిరగకపోవడం.. బిజినెస్ పడిపోతుండటంతో షాపింగ్ మాల్ యజమాని ఏమీ చేయలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట. ఈ నిర్ణయంతో ప్రస్తుతం బిజినెస్ బాగా జరుగుతోందట. మాస్క్‌లు వేసుకుని గర్ల్ ఫ్రెండ్‌ను తీసుకుని వెళుతున్నారట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు