ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ పేరుతో వచ్చిన యాప్‌లు ప్రస్తుతం ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. జేబులో అర్థరూపాయి లేకున్నా కేవలం ఫోన్ ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలు చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అందులో ముఖ్యమైన యాప్ ఫోన్ పే. ఆ యాప్ ద్వారా డబ్బులను అతి సులువుగా ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నారు జనం.
అయితే ఫోన్ పే వాడుతున్న వారికి ఇది శుభవార్తే...? దీని ద్వారా ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ తదితర ఆర్థికలావాదేవీలు చేస్తున్నారా?ఇక నుండి ఫోన్ పే యూజర్లు తమ యూపీఐ ద్వారా మనీ డ్రా చేసుకోవచ్చు. ఫోన్ పే ఏటీఎం పేరుతో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్‌తో వ్యాపారవేత్తలకు ఆన్‌లైన్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసి నగదు తీసుకోవచ్చు.