దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో ప్రస్తుతం కొత్త రకం సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా రిలయన్స్ జియో తన మైజియో యాప్ ద్వారా సరికొత్త యూపీఐ పేమెంట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. దీంతో బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా చెల్లింపులు నిర్వహించొచ్చు.
జియో యూజర్లు వారి బ్యాంక్ అకౌంట్‌ను జియో యాప్‌లోని యూపీఐతో లింక్ చేసుకొని పేమెంట్స్ నిర్వహించవచ్చు. బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు పంపడం.. స్కాన్ అండ్ పే, రిక్వెస్ట్ మనీ, పాస్‌బుక్ వంటి పలు ఆప్షన్లు కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి. కస్టమర్లు మల్టీపుల్ బ్యాంక్ అకౌంట్లను మైజియో యాప్‌తో అనుసంధానం చేసుకోవచ్చు.
రిలయన్స్ జియో కొత్త సేవలతో జియో యూజర్లు మైజియో యాప్ నుంచి నేరుగా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చునని వార్తలు వస్తున్నాయి. దీంతో జీ-పే, ఫోన్‌పే, పేటీఎంలతో జియో యూపీఏ చెల్లింపు సేవలు పోటీపడేలా వుంటాయని ఐటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.