అలిగిన భార్యను సంతృప్తి పరిచేందుకు లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసిన భర్త.. తర్వాత... ఏమైంది...

గురువారం, 16 మార్చి 2023 (21:59 IST)
అలిగిన భార్యను సంతృప్తి పరిచేందుకు కట్టుకున్న భర్త చేసిన ఓ పనికి ఇపుడు ఆ దంపతులు కోటీశ్వరులయ్యారు. ఇంతకీ ఆ వ్యక్తి చేసిన పనేంటో తెలుసా? భార్యను సంతృప్తి పరిచేందుకు రెండు లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేయడమే. ఈ ఆసక్తికర సంఘటన ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ నగరంలో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ నగరానికి చెందిన ఓ జంట గత మూడు దశాబ్దాలుగా క్రమం తప్పకుండా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఇటీవల తన పేరుమీద లాటరీ టిక్కెట్‌‍ను భర్త కొనుగోలు చేయడం మరిచిపోయాడు. దీంతో ఆమె భర్తపై అలిగింది. ఆమె అలకను తీర్చేందుకు ఆ వ్యక్తి తన భార్య పేరు మీద రెండు లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేశాడు. ఈ లాటరీ టిక్కెట్ల ఫలితాలు గత సోమవారం వెలువడ్డాయి. 
 
ఇందులో ఈ రెండు లాటరీ టిక్కెట్లకు డ్రా తగిలింది. ఒకటి కాదు రెండు కాదు.. ఒక్కో టిక్కెట్‌కు ఏకంగా రూ.8 కోట్లు చొప్పున కలిపి మొత్తం 16 కోట్లు వచ్చిపడ్డాయి. దాంతో ఆ భార్యాభర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ డబ్బుతో తమ కుమార్తెకు కొత్త ఇల్లు కొనిస్తామని, తమ పిల్లల కోసమే కాకుండా వారి పిల్లల కోసం కూడా లాటరీ సొమ్మును వినియోగిస్తామని ఆ దంపతులు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు