అమెరికా ప్రజలకు శుభవార్త : కరోనా ఉద్దీపన ప్యాకేజీకి కాంగ్రెస్ ఆమోదం

గురువారం, 11 మార్చి 2021 (14:22 IST)
ఇందులోభాగంగా, 1.9 ట్రిలియన్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీ బిల్లుకు గురువారం ఆ దేశ కాంగ్రెస్‌ ఆమోదం తెలిపింది. కొవిడ్‌-19తో ఏర్పడిన సంక్షోభం కారణంగా చతికిలపడ్డ చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు ఊతమిచ్చి, పౌరుల్ని ఆర్థికంగా ఆదుకునేందుకు.. అధ్యక్షుడు బైడెన్‌ గతంలో 1.9 ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత భారీ ఉద్దీపన ప్యాకేజీ కావడం విశేషం. 
 
అమెరికన్‌ కాంగ్రెస్‌లో బుధవారం ఈ బిల్లును ప్రవేశ పెట్టగా.. 220-211 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. డెమోక్రాట్లందరూ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా.. రిపబ్లికన్లు వ్యతిరేకించారు. అత్యధిక మంది సభ్యుల నుంచి బిల్లుకు మద్దతు లభించడంతో ఆమోదం పొందినట్లు స్పీకర్‌ నాన్సీ పెలోసీ ప్రకటించారు. కాంగ్రెస్‌లో బిల్లు ఆమోదం పొందడం పట్ల బైడెన్‌ హర్షం వ్యక్తం చేశారు. 
 
అనంతరం కొద్దిసేపటికే ‘నిరుద్యోగులకు ఉపశమనం, అందరికీ టీకాలు’ అని పేర్కొంటూనే.. ‘సహాయం ఇక్కడ ఉంది’ అంటూ బైడెన్‌ ట్వీట్‌ చేశారు. ఆ బిల్లుపై బైడెన్‌ శుక్రవారం సంతకం చేయనున్నట్లు తెలిపారు. అధ్యక్షుడి సంతకం చేసిన తర్వాత ఉద్దీపన ప్యాకేజీ బిల్లు చట్టరూపం దాలుస్తుంది. ‘ఈ రోజు మనం తీసుకున్న ఈ నిర్ణయం మిలియన్ల మంది అమెరికన్ల జీవితాలను, జీవనోపాధిని కాపాడేది’ అని స్పీకర్‌ నాన్సీ పెలోసీ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు