స్వీట్ల విక్రయాలకు ఎన్నికలు తెచ్చిన తంటా?

బుధవారం, 10 మార్చి 2021 (12:47 IST)
స్వీట్ల విక్రయాలకు ఎన్నికలు అడ్డంకిగా మారాయి. ఈ పరిస్థితి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నెలకొంది. ఈ రాష్ట్ర అసెంబ్లీకి 9 దశల్లో పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం ముమ్మంగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోమిఠాయి దుకాణాల వ్యాపారులు స్వీట్లపై వివిధ రాజకీయ పార్టీల గుర్తులతో ప్రచారం సాగిస్తున్నారు. 
 
సిలిగుడి నగరంలోని ఓ మిఠాయి దుకాణంలో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల గుర్తులు, రంగులతో వివిధ రకాల మిఠాయిలు తయారు చేసి విక్రయిస్తున్నారు. తాను సీజన్‌ను బట్టి వినూత్న రకాల మిఠాయిలను తయారు చేసి విక్రయిస్తుంటానని దుకాణ యజమాని పంకజ్ ఘోష్ చెప్పారు. 
 
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఖాతాదారుల అభిరుచుల మేర పార్టీల గుర్తులతో తాను స్వీట్లను తయారు చేస్తున్నట్లు పంకజ్ చెప్పారు. కోల్‌కతా నగరంలోని స్వీటు షాపు యజమాని బలరాం మల్లిక్ రాథారమణ్ కూడా వివిధ పార్టీల గుర్తులు, సందేశాలతో బెంగాల్ స్వీట్లను విక్రయిస్తున్నారు. మిఠాయిల విక్రయాల్లోనూ పార్టీల గుర్తులు వేస్తుండటంతో బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార హోరు ఆరంభమైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు