కాలిఫోర్నియాలో కాల్ ఫైర్.. 59కి చేరిన మృతుల సంఖ్య.. ప్యారడైజ్ కాలిపోయింది..

గురువారం, 15 నవంబరు 2018 (14:20 IST)
అమెరికాలోని కాలిఫోర్నియాలో కాల్ ఫైర్ అనే మూడు కార్చిచ్చులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో సంభవించిన కార్చిచ్చు అక్కడి ప్యారడైజ్ నగరాన్ని బూడిద కుప్పగా మార్చేసింది. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 59మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
గత వారం రోజులుగా క్యాంప్ ఫైర్, వూల్సే ఫైర్, కాల్ ఫైర్ అనే మూడు కార్చిచ్చులు ఉత్తర కాలిఫోర్నియాలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. కార్చిచ్చుకు తోడు విపరీతమైన గాలులు తోడు కావడంతో సమీప ప్రాంతాలను కాల్చి పారేస్తోంది. దీనిని చల్లార్చేందుకు వేలాది మంది అగ్ని మాపక సిబ్బంది రేయింబవళ్లు ప్రయత్నిస్తున్నారు.
 
దీనిపై హై అలెర్ట్ ప్రకటించిన ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆర్మీని ఆదేశించింది. కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు 59  మంది ప్రాణాలు కోల్పోగా, 130 మంది ఆచూకీ గల్లంతయ్యింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు