కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. తాతయ్య కళ్లముందే.. మునిమనవళ్లు..?

మంగళవారం, 31 జులై 2018 (11:53 IST)
ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు రగిలిపోతోంది. కార్చిచ్చుతో ఇప్పటికే లేక్‌పోర్ట్ పట్టణంలోని నాలుగిళ్లు నిప్పుకు ఆహుతి అయ్యాయి. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయార. వీరిలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ఉండగా.. మరో ఆరుగులు పౌరులు ఉన్నారు.


ఈ ప్రమాదంలో ఓ చిన్నారి తాతయ్యను కాపాడమని పిలుస్తుంటే.. ఎడ్‌బ్లెడ్ ‌అనే పెద్దాయన గుండె బద్ధలైపోయింది. అతని కళ్ల ముందే మునిమనవళ్లు అగ్నికి బలైపోవడం చూసి గుండె తరుక్కుమంది. వివరాల్లోకి వెళితే.. భార్య, ఇద్దరు మునిమనవళ్లను తన కళ్లముందే కోల్పోయాడు ఎడ్‌ బ్లెడ్‌సోయ్‌. 
 
గత ఆదివారం తాను పనిమీద బయటకు వెళ్లగా కాసేపటికే ఇంటి నుంచి ఫోన్ వచ్చిందని ఎడ్ బ్లెడ్‌సోయ్ అన్నారు. అవతలివైపు తన భార్య మెలొడీ(70) భయంతో మాట్లాడిందని.. ఏం జరిగిందని అడగ్గా.. మంటలు సమీపిస్తున్నాయి.. త్వరగా రండి అంటూ ఫోన్‌ పెట్టేసింది. దీంతో తాను కంగారుకంగారుగా ఇంటికి వెళ్లి చూస్తే కార్చిచ్చు ఇల్లంతా వ్యాపించింది. 
 
మంటల్లో చిక్కుకున్న తన ఐదేళ్ల మునిమనవడు జేమ్స్‌ రాబర్ట్స్‌ తాతయ్య రా.. తనను బయటకు తీసుకెళ్లమని పిలుస్తున్నాడు. కానీ మంటలు తనను లోపలికి వెళ్లనివ్వలేదు. వారు బయటకు రాలేదంటూ గద్గద స్వరంతో చెప్పారు బ్లెడ్‌సోయ్‌.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు