అంగారకుడిపై ఇంద్రధనుస్సు.. అద్భుతమైన ఫోటో..

బుధవారం, 7 ఏప్రియల్ 2021 (17:28 IST)
Mars Rainbow
అంగారకుడి మీదకు వెళ్లిన నాసా మార్స్ రోవర్ పెర్కషన్ అక్కడి వినీలాకాశంలో అద్భుతమైన ఫొటో తీసి పంపింది. ఆ ఫొటోను చూసిన నాసా శాస్త్రవేత్తలు ఒక్కసారిగా షాకైయ్యారు. సాధారణంగా భూమి పైనున్న ఆకాశంలో అప్పుడప్పుడు కనువిందు చేసే ఇంద్రధనస్సు అంగారకుడిపై ఉన్న ఆకాశంలో కనిపించింది. 
 
మార్స్‌ రోవర్‌ పంపిన ఫొటోలో అంగారక గ్రహం ఆకాశంలో ఇంద్రధనస్సు స్పష్టంగా, అందంగా కనిపిస్తుంది. ఒక రోవర్ భూమికి దూరంగా కెమెరాలో ఇలాంటి దాన్ని బంధించడం ఇదే మొదటిసారి. ఈ సమాచారాన్ని నాసా ట్వీట్ చేసింది. నాసా మార్స్ రోవర్ ఈ ఫొటోను ఫిబ్రవరి 18న తీసి పంపింది.
 
ఇది అరుణ గ్రహంపై ఇంద్రధనస్సు నిజమేనా అని చాలా మంది అడుగుతున్నారు. ప్రతిస్పందనగా నాసా నో అని చెప్పింది. నాసా ప్రకారం.. అంగారక గ్రహంపై ఇంద్రధనస్సు ఏర్పడదు. సాధారణంగా ఇంద్రధనస్సు కాంతి ప్రతిబింబాలు, చిన్న నీటిచుక్కలతో తయారవుతుందని నాసా చెప్తుంది.
 
అయితే అంగారకుడిపై నీరు లేనందున ఇంద్రధనస్సు ఏర్పడటం ఆశ్చర్యకరమే. మార్స్‌ వాతావరణంలో ద్రవ నీటి పరంగా ఇది చాలా చల్లగా ఉంటుంది. వాస్తవానికి మార్స్ ఆకాశంలో కనిపించే ఈ ఇరిడిసెంట్ రంగు రోవర్ కెమెరాలో అమర్చిన లెన్స్ యొక్క మెరుపు అని నాసా తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు