అమెరికా దేశంలోని అలబామాలో ఓ మహిళ సరికొత్త రికార్డు సృష్టించారు. పంది కిడ్నీతో ఏకంగా 130 రోజుల పాటు జీవించారు. ఇది వైద్య చరిత్రలోనే ఓ మిరాకిల్‌గా భావిస్తున్నారు. ఆమె పేరు టోవానా లూనీ. జంతువు కిడ్నీతో మనిషి ఇప్పటివరకు 2 నెలలకు మించి బతికిన సందర్భాలు లేవు. కానీ, ఈ మహిళ విషయంలో అది సరికొత్త రికార్డు నెలకొల్పారు.
ఏప్రిల్ 4వ తేదీన న్యూయూర్క్ యూనివర్శిటీ లాంగోన్ హెల్త్ సెంటరులో జరిగిన తొలగింపు ఆపరేషన్ తర్వాత ఆమె బాగా కోలుకున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఇకపై ఆమె మళ్లీ డయాలసిస్ చేయించుకుంటారని, మనిషి కిడ్నీ లభించిన తర్వాత ఆమెకు మళ్లీ కిడ్నీ అమర్చుతామని వారు వెల్లడించారు.