డోనాల్డ్ ఒక పోరాట యోధుడు, అతను ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రతిరోజూ మీ కోసం పోరాడుతాడు అని అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ అన్నారు. తన భర్త కోసం తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అతన్ని 'పోరాట యోధుడు' అని ప్రశంసించారు.
ఈ నేపథ్యంలో డోనాల్డ్ ఒక పోరాట యోధుడు, అతను ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాడంటూ పెన్సిల్వేనియాలోని నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. ఆమె గత వారం కరోనా నుంచి కోలుకున్నారు. 'మా కుటుంబం కోవిడ్ -19 తో బాధపడుతున్నప్పుడు మీరు మాకు ఇచ్చిన అన్ని ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు' అని ఆమె తెలిపారు.