ప్రారంభంలో ఉత్తర కొరియా సమస్యను చైనా సహకారంతో చర్చలు జరిపి వుంటే బాగుండేదని హిల్లరీ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఉత్తరకొరియా విధానాలుకూడా సరిగాలేవని తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఆంక్షలను లెక్కచేయకుండా ఉత్తరకొరియా అణు పరీక్షలను ప్రయోగించడం సరికాదని స్పష్టం చేశారు. అలాగే గువామ్‌పై దాడి పేరిట జపాన్ మీదుగా మిస్సైల్ ప్రయోగించడం ఆ దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమేనన్నారు. ఇలాంటి ప్రయోగాలను ఏ దేశమూ జరుపకూడదని స్పష్టం చేశారు.