ముఖ్యంగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తరచుగా అణ్వాయుధం అనే పదాన్ని వాడుతున్నారు. ఈ పదాన్ని వాడరాదని పుతిన్‌ను గట్టిగా హెచ్చరించేవాడినని చెప్పారు. ప్రతి రోజూ పుతిన్ అణ్వాయుధ ప్రస్తావన తీసుకొస్తున్నారని, దీంతో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారని చెప్పారు. అందుకే అణ్వాయుధ పదాన్ని పదేపదే ప్రస్తావించరాదని పుతిన్‌ను గట్టిగా హెచ్చరించివుండేవాడినని డోనాల్డ్ ట్రంప్ అన్నారు.