కథ ప్రకారం చూస్తే, భారతదేశంనుంచి చదువుకోసం వెళ్ళి అక్కడ రష్యన్ అమ్మాయి ప్రేమలో పడిన కుర్రాడి కథ. చివరికి ఆమె ఇంటివారు మాఫియా వ్యక్తికి ఇచ్చి పెండ్లిచేయబోతారు. ఆ తర్వాత ఈ ఇద్దరు ప్రేమికులు ఎలా అడ్డంకులను ఫేస్ చేశారనేది పాయింట్. ఇది యుద్ధానికి ముందు తీసిన సినిమా కాబట్టి అసలు ఉక్రెయిన్ అందాలన్నీఈ సినిమాలోనే చూడవచ్చని దర్శకుడు తెలియజేస్తున్నారు. ఉక్రెయిన్ గ్రామాల్లలోకూడా కథ ప్రకారం షూట్ చేశామనీ, అక్కడి పద్ధతులు సాంప్రదాయులు కళ్ళకు కట్టినట్లు చూడొచ్చని అంటున్నారు.
లవ్ ఇన్ ఉక్రెయిన్ నిర్మాతలు ఉక్రెయిన్ ప్రజలకు భారతీయ చిత్రనిర్మాతల ప్రేమ, సంఘీభావానికి చిహ్నంగా ఉక్రెయిన్‌లో ఉచిత విడుదలను ప్లాన్ చేస్తున్నారు. ఉక్రెయిన్‌లోని అన్నిచోట్ల విడుదలకాకపోవచ్చని వారు తెలిపారు.
లిజబెటా, N.K.G., మైఖేల్ స్ట్రిగా, లోలిత జురావ్‌లోవా, రోమన్ బాట్రిన్, రుస్లాన్ సెఫెరోవ్, ఒలెస్ డిమిత్రెంకో, ఇర్మా బాలన్, కాన్‌స్టాంటిన్ షిరియావ్, వ్లాదిమిర్ డిడెన్‌కో మరియు సెర్గీ ప్షెనిచ్నితో విపిన్ కౌశిక్ నటించారు.