తల్లిదండ్రుల బంధం ప్రస్తుతం చిన్నారులకు ఏమాత్రం అర్థం కావట్లేదు. తల్లిదండ్రులు ఉద్యోగాల కోసం గంటల తరబడి ఆఫీసులకే పరిమితం కావడం.. ఇంటికొచ్చినా ఫోన్లు, టీవీలతో గడపటం కారణంగా చిన్నారులకు స్మార్ట్ ఫోన్ల యుగంలో తల్లిదండ్రుల ప్రేమ కరువైపోతోంది. ఇలా తల్లిదండ్రులు ఎలాంటి కారణం లేకుండా తరచూ తమ ఎనిమిదేళ్ల కుమారుడిపై చేజేసుకోవడం.. ఘోరానికి దారితీసింది.
వివరాల్లోకి వెళితే.. ఉక్రెయిన్‌కు చెందిన తల్లిదండ్రులు ఎనిమిదేళ్ల కుమారుడిని తరచూ కొట్టడం, కారణం లేకుండా తిట్టడం వంటివి చేస్తుండేవారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ చిన్నారి తొమ్మిదో అంతస్థు నుంచి కిందకి దూకాడు.