ఐఎస్ ఉగ్రవాదుల చెర అనేకమంది మహిళలు బందీలుగా ఉన్నారు. మహిళలను ఐఎస్ ఉగ్రవాదులు సెక్స్ బానిసలుగా మార్చేస్తున్నారు. ఈ క్రమంలో తాను బందీగా ఐఎస్ ఉగ్రవాదులకు పట్టబడిన ప్రాంతానికి వెళ్లిన మహిళ భావోద్వేగానికి గురైంది. ఆమె ఎవరో కాదు.. ఐఎస్ టెర్రరిస్టుల లైంగిక జీవన విధానాన్ని.. వారు మహిళలకు నరకం చూపించిన విధానాన్ని ప్రపంచానికి తెలిసే చేసిన ఇరాక్ మహిళ నదియా మురాద్.
ప్రస్తుతం ఐరాసలో యాజిదీలు, శరణార్థులు, మహిళల హక్కులపై పోరాడే లాయర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా నదియా ఇరాక్‌లోని యాజాది గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామంలో మూడేళ్ల క్రితం చోటుచేసుకున్న దురాగతాన్ని అంతర్జాతీయ మీడియాకు వివరించారు. 2014లో తమ గ్రామాన్ని ఐసిస్ ఉగ్రవాదులు చుట్టుముట్టారని.. కొన్ని నిమిషాల్లోనే మగవారిని, ఆడవారిని వేరు చేశారన్నారు. పురుషుల్ని కళ్ల ముందు కాల్చి చంపేశారు. కానీ మహిళల్ని చంపేస్తారనుకుంటే.. ఆ రాక్షసులు ఆ పనిచేయలేదు.
తమలోని యువతులను ఇరాక్‌లోని మొసూల్ తీసుకెళ్లి వేలం వేశారని నదియా మురాద తెలిపింది. అప్పటికే వారి చేతుల్లో నలిగిపోయామని.. ఆ తర్వాత సిరియన్లు, యూరోపియన్లు, ఇరాకీయులు వారి కామవాంఛలను తీర్చుకునేందుకు తమను వాడుకున్నారని తెలిపింది.