సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్ ప్రపంచ వ్యాప్తంగా బాగా ఫేమస్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫేస్ బుక్ చైనాలోనూ ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికైతే చైనాలో ఫేస్‌బుక్‌పై నిషేధం వుంది. తద్వారా అతిపెద్ద వాణిజ్యాన్ని అందించే దేశానికి ఫేస్‌బుక్ దూరంగా వుంది. అయితే త్వరలో చైనాలోనూ ఫేస్‌బుక్ ప్రవేశించాలని మల్లగుల్లాలు పడుతోంది.
తాజాగా కలర్ బలూన్ అనే యాప్ ఫేస్‌బుక్ మొమెంట్స్ యాప్ తరహాలో వుండటం ఇందుకు కారణం. ఈ యాప్ ద్వారా ఫేస్‌బుక్ చైనాలోకి ప్రవేశించి తన కార్యకలాపాలను మొదలెట్టాలని ఫేస్ బుక్ భావిస్తుందా.. అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా సీక్రెట్‌గా ఈ యాప్ ద్వారా చైనాలోకి అడుగెట్టేందుకు పరీక్షలు చేస్తుందా అని ఐటీ నిపుణులు అనుమానిస్తారు. కాగా చైనాలో 2009 జూలైలో ఫేస్‌బుక్‌పై నిషేధం విధించడం జరిగింది. ఇంకా వాట్సాప్‌ను కూడా ఆ దేశంలో బ్యాన్ చేశారు.