అత్యంత రహస్య భద్రత కలిగిన ఈ మహిళ.. తన జర్మనీలో ఉన్న తన తల్లిదండ్రులను కలిసేందుకు వెళుతున్నానని చెప్పింది. కానీ, ఆమె అక్కడకు వెళ్లకుండా టర్కీ సరిహద్దుల మీదుగా సిరియాకు వెళ్ళి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిని కలిసి, వివాహం చేసుకుంది. అయితే అతడు ఎవరనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
జర్మనీలో జన్మించిన డెనిస్ కస్పెర్ట్ అనే ఉగ్రవాదిని ఆమె వివాహం చేసుకొన్నట్టుగా స్థానిక మీడియా ప్రసారం చేసింది. 2015లో డెనిస్‌ను ఉగ్రవాదిగా అమెరికా గుర్తించింది. జర్మనీకి చెందిన ఐసిస్ ఉగ్రవాద గ్రూపుపై నిఘా నిర్వహించేందుకుగాను ఎఫ్.బి.ఐలో అనువాద విభాగంలో డానియెలాను నియమించారు. 2011లో అమెరికన్‌ను వివాహం చేసుకొన్న ఆమె అనూహ్యంగా 2014లో మాయమై డెనిస్‌ను పెళ్లిచేసుకుంది.