గర్భస్థ శిశువుకు మెదడులో అరుదైన శస్త్రచికిత్స

శుక్రవారం, 5 మే 2023 (16:14 IST)
బ్రిగ్‌హామ్-ఉమెన్స్ హాస్పిటల్, బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు చెందిన వైద్యుల బృందం ఇటీవలే గర్భంలో ఉన్న శిశువుకు సంచలనాత్మక శస్త్రచికిత్సను నిర్వహించింది. యునైటెడ్ స్టేట్స్‌లో ఈ ప్రక్రియ మొదటిసారిగా నిర్వహించబడింది. 
 
బోస్టన్ చిల్ట్రన్స్ ఆస్పత్రికి చెందిన వైద్యుల బృందం అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. గర్భంలో 30 వారాల శిశువుకు అరుదైన మెదడు శస్త్రచికిత్సను చేశారు. అల్ట్రాసౌండ్‌తో, గాలెన్ వైకల్యాన్ని సరిచేశారు. గాలెన్ వైకల్యం సిరతో బాధపడుతున్న బేబీ డెన్వర్‌కు శస్త్రచికిత్స జరిగింది. 
 
ఈ పరిస్థితి ఉన్న చాలామంది పిల్లలు గుండె ఆగిపోవడం లేదా మెదడు దెబ్బతినడం వంటివి ఎదుర్కొంటారు. అల్ట్రాసౌండ్ గైడెన్స్, అమ్నియోసెంటెసిస్ కోసం ఉపయోగించే సూది, చిన్న కాయిల్స్‌ని ఉపయోగించి, డెన్వర్ 34 వారాల గర్భధారణ సమయంలో గర్భాశయంలో ఉన్నప్పుడు బృందం వైకల్యాన్ని సరిచేయగలిగింది. ఈ అరుదైన శస్త్రచికిత్స విజయవంతమైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు