అమెరికన్లకు గుడ్ న్యూస్.. ఇక మాస్కుల అవసరం లేదు.. సీడీసీ

శుక్రవారం, 14 మే 2021 (12:07 IST)
అమెరికన్లకు అక్కడి ప్రభుత్వం తాజాగా ఓ శుభవార్త చెప్పింది. మాస్కులు ధరించడంపై అమెరికన్లకు ఆ దేశ వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు ఇకపై మాస్కు ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రయాణాలకు ముందు, తర్వాత కరోనా టెస్టులు అవసరం లేదని ప్రకటించింది. ప్రయాణం తర్వాత క్వారంటైన్, ఐసోలేషన్ అవసరం లేదని తెలిపింది.
 
కరోనాతో నాడు అత్యంత దారుణంగా ప్రభావితమైన అమెరికా.. సాధారణ పరిస్థితుల వైపు శరవేగంగా అడుగులు వేస్తోందనడానికి ఇదే నిదర్శనం. ఇక సీడీసీ ప్రకటనపై అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికన్లకు వ్యాక్సిన్లను శరవేగంగా అందిస్తుండటం వల్లే ఈ మైలురాయి సాధ్యమైందని తెలిపారు. కరోనాపై పోరాటంలో ఇదో గొప్ప రోజన్నారు. 114 రోజుల్లో 25 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించామని వెల్లడించారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు