ఫ్రాన్స్ ప్రధాని కుర్చీలో గే.. 34 ఏళ్ల వయస్సులోనే ఆ రికార్డ్

సెల్వి

మంగళవారం, 9 జనవరి 2024 (23:04 IST)
Gabriel Attal
ఫ్రాన్స్ ప్రధాని కుర్చీలో గే కూర్చోనున్నారు. ఇప్పటివరకు ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరించిన గాబ్రియెల్ అట్టల్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టనున్నారు. 
 
ఫ్రాన్స్ ప్రధానమంత్రి పదవికి ఎలిజబెత్ బోర్న్ రాజీనామా చేసిన ఒక్కరోజు వ్యవధిలోనే దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నూతన ప్రధానిని నియమించే ప్రక్రియను పూర్తి చేశారు. తద్వారా ఫ్రాన్స్ ప్రధాని పదవి చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా గాబ్రియల్ అట్టల్ నిలిచిపోనున్నారు. 
 
34 ఏళ్ల గాబ్రియెల్ అట్టల్ స్వలింగ సంపర్కులు. గాబ్రియెల్ అట్టల్ కరోనా సమయంలో ఎంతో చురుగ్గా వ్యవహరించడం మేక్రాన్‌ను ఆకట్టుకుంది. దీంతో ఆయనను ప్రధాని పదవి వరించింది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు