అమెరికాలోని రోడ్ ఐ లాండ్ ప్రాంతానికి చెందిన నికోస్ అనే గే టీచర్... 'టీచర్ ఆఫ్ ది ఇయర్-2017' గా ఎంపియ్యాడు. దీంతో ఆయనకు... అధ్యక్షుడు ట్రంప్‌ను కలుసుకునే అవకాశం వచ్చింది. నికోస్.. వైట్‌హౌస్‌కి వెళ్లినప్పుడు కాలర్ చుట్టూ గోల్డ్ ఆంకర్, చేతిలో లేస్ ఫ్యాన్ పట్టుకుని వెళ్లాడు. ట్రంప్‌తో సమావేశం పూర్తయ్యాక నికోస్... ట్రంప్‌తో ఫొటో దిగాడు. 'నీ స్టయిల్ నాకెంతో నచ్చిందంటూ' అతన్ని ట్రంప్ అభినందనల్లో ముంచెత్తారు.
ఆ ఫొటోలో ఫస్ట్ లేడీ మోలానియా కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఫొటో చర్చనీయాంశమైంది. పలు మీడియా సంస్థలు నికోస్‌ను పొగరు బోతు గే టీచర్ అని విమర్శలు గుప్పించాయి. అయితే ట్రంప్ మాత్రం బెస్ట్ టీచర్ల సమావేశం పూర్తయ్యాక... నికోస్‌తో నీ స్టయిల్ నాకు బాగా నచ్చింది అన్నారు. తనతో ఈ విధమైన స్టయిల్‌లో ఫొటో దిగేందుకు ట్రంప్ అభ్యంతరం చెప్పలేదని నికోస్ తెలిపాడు.