ఇమ్మిగ్రేషన్‌ను వ్యతిరేకించే ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీకి 13.1 శాతం ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో మెర్కెల్.. ప్రభుత్వం ఏర్పాటుకు మరో పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ప్రతిపక్ష పార్టీ సోషల్ డెమొక్రటిక్‌కు 20.8 శాతం ఓట్లు వచ్చాయి. దీనిని గమనిస్తే జర్మనీలోని సగం జనాభా ఓట్లను రెండు పార్టీలే దక్కించుకున్నాయని తెలుస్తోంది.
కాగా, ఆదివారం నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం మెర్కెల్ పార్టీకి 32.5–33.5 శాతం, ఎస్‌పీడీకి 20–21 శాతం, ఏఎఫ్‌డీకి 13–13.5 శాతం ఓట్లు వచ్చాయి. 2005లో తొలిసారిగా ఏంజిలా చాన్స్‌లర్ పదవి చేపట్టారు. ఆమె నాయకత్వంలోని క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్ (సీడీయూ) – క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ) కూటమి 2009, 2013 ఎన్నికల్లో ఆధిక్యం సాధించడంతో పన్నెండేళ్లుగా ఏంజిలానే చాన్స్‌లర్ పదవిలో కొనసాగుతున్నారు. ఈసారి గెలిస్తే 16 ఏళ్లు అధికారంలో ఉండి, హెల్ముల్ కోల్ రికార్డును మెర్కెల్ సమం చేస్తారు.