Marriage: పెళ్లి చేసుకుంటే మాత్రం చాలు.. ప్రభుత్వమే 12 లక్షలు ఇస్తుంది..!

సెల్వి

సోమవారం, 26 మే 2025 (15:09 IST)
అవును మీరు చదువుతున్నది నిజమే. పెళ్లితో ఒకటయ్యే దంపతులకు రూ.12 లక్షలు ఇచ్చే ఒక దేశం వుంది. ఆ దేశం ఏదో తెలుసుకోవాలంటే కథనం చదవండి మరి. ఈ దేశంలో వివాహానికి అవసరమైన నగదు అందజేస్తారు. పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత అయ్యే ఖర్చులకు కూడా సర్కారే డబ్బులిస్తుంది. 
 
దక్షిణ కొరియాలో జనాభా తక్కువగా వుండటంతో జనాభా రేటును పెంచేందుకు ఆ దేశ సర్కారు వివాహాలను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం వివాహం చేసుకునే దంపతులకు ఆ దేశం లక్షలాది రూపాయల సాయం చేస్తోంది. డేటింగ్ నుంచి నిశ్చితార్థం వరకు ఆపై పెళ్లి నుంచి హనీమూన్ వరకు ఆ దేశ ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుంది. 
 
జనాభాను పెంచడమే ఈ పెళ్లి ప్రోత్సాహకాల లక్ష్యం. ఈ స్కీమ్‌ల ద్వారా పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య పెరుగుతుందని తద్వారా జనాభా రేటు పెరుగుతుందని ఆ దేశం భావిస్తోంది. అంతేగాకుండా దక్షిణ కొరియా సర్కారు స్వయం వరం కూడా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొని.. వివాహం చేసుకునే జంటలకు రూ.12లక్షల ఆర్థిక సాయాన్ని దక్షిణ కొరియా అందజేస్తుంది. దక్షిణ కొరియానే కాకుండా జపాన్‌లోనూ ఇదే సమస్య కొనసాగుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు