హఫీజ్ ఉగ్రవాది కాదు.. మంచి సేవాతత్పరుడు.. : పర్వేజ్ ముషారఫ్
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (08:11 IST)
ముంబై పేలుళ్ల కుట్రదారు, ఉగ్రవాద సంస్థ జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వత్తాసు పలికాడు. హఫీజ్ చాలా మంచోడంటూ క్లీన్ చిట్ ఇచ్చాడు.
ప్రస్తుతం పాకిస్థాన్ అధికారులు హఫీజ్‌ను పాక్ ప్రభుత్వం 90 రోజుల పాటు గృహనిర్బంధంలో ఉంచారు. దీనిపై పర్వేజ్ ముషారఫ్ స్పందిస్తూ హఫీజ్ సయీద్‌ను మంచివాడన్నారు. అలాంటి వ్యక్తిని గృహ నిర్బంధంలో ఉంచడం భావ్యం కాదన్నారు. అందువల్ల ఆయనను తక్షణం విడుదల చేయాలని అంటున్నారు.
హఫీజ్ ఉగ్రవాది కాదని, ఓ మంచి ఎన్జీవోను నడిపిస్తున్నారన్నారు. హఫీద్ సయీద్ పాకిస్థాన్‌లో సేవా కార్యక్రమాలను నిర్వహించాడని గుర్తు చేశారు. హఫీజ్ పాక్ సహా ప్రపంచంలో ఎక్కడా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడలేదని ముషారఫ్ వ్యాఖ్యానించడం గమనార్హం.