అది కాస్తా సీసీ కెమెరాలో రికార్డైంది. సిబ్బంది సమాచారం మేరకు అతడిని 2018, ఏప్రిల్‌లో ఎయిర్‌పోర్ట్ పోలీసులు విచారించారు. ప్రయాణికుడి లగేజీ నుంచి తాను రెండు మామిడి పండ్లు తీసుకున్నట్లు ఒప్పుకోవడంతో అతడ్ని అరెస్ట్ చేశారు.
తాజాగా దుబాయ్ కోర్టులో విచారణకు వచ్చిన ఈ కేసు పూర్వాపరాలు విచారించి కార్మికుడు తన నేరాన్ని అంగీకరించడంతో అతడికి న్యాయస్థానం 3 నెలల జైలు శిక్ష, 5వేల దిర్హమ్స్ (మన కరెన్సీ ప్రకారం రూ.96,400) జరిమానా విధించింది.
అంతే కాదు శిక్షాకాలం పూర్తయిన తరువాత దేశం విడిచి వెళ్లాలని కూడా ఆదేశించింది. కేవలం రూ.115 విలువ చేసే మామిడి పండ్లు తీసినందుకు ఇంత పెద్ద శిక్షనా అని పాపం నెత్తీ నోరు మొత్తుకుంటున్నాడు భారతీయుడు. ఆ దేశంలో రూల్స్ అతిక్రమిస్తే విదేశీయులకైనా, స్వదేశీయులకైనా శిక్షలు అలాగే ఉంటాయి మరి.