అగ్రరాజ్యం అమెరికాతో చేతులు కలిసి తీవ్రంగా నష్టపోయినట్టు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో అమెరికాతో కలిసి పని చేయకుండా తటస్థంగా ఉండివుండాల్సింది అని చెప్పుకొచ్చారు.
న్యూయార్క్‌లో జరిగిన విదేశీ సంబంధాల మండలి (సీఎఫ్‌ఆర్) మేధోవర్గం సదస్సులో ఇమ్రాన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 18 యేళ్ళ క్రితం అంటే 2001 సెప్టెంబర్ 11న ఆల్‌ఖైదా ఉగ్రవాదులు న్యూయార్క్ మన్‌హట్టన్లోని వాణిజ్య భవనాలు (డబ్య్లూటీసీ) ట్విన్ టవర్స్‌పై విమానాలతో దాడులు చేసి కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 2,976 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 6 వేల మంది గాయపడ్డారు.
2011, మే 2వ తేదీన అమెరికా దళాలు అర్థరాత్రి లాడెన్ ఇంటిపై దాడిచేసి మట్టుబెట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ సైన్యానికి తెలిసే ఇదంతా జరిగిందన్నది అప్పటి చర్చ. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ 9/11 తర్వాత సంఘటనలపై ఇప్పుడు వాపోవడం చర్చనీయాంశమైంది.