ఈ టీకా అథెరోస్క్లెరోసిస్‌ను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది ధమనులలో కొవ్వు పేరుకుపోవడం రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది, దీని వలన గుండెపోటు, స్ట్రోక్‌లు సంభవిస్తాయి. ప్రపంచ ఆరోగ్య డేటా ప్రకారం, అథెరోస్క్లెరోసిస్ సంబంధిత సమస్యల కారణంగా ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు మరణాలకు ప్రధాన కారణంగా మారింది. ఇది పిల్లలతో సహా అన్ని వయసుల వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో, 40-69 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో 45శాతం మరణాలు గుండెపోటు వల్ల సంభవిస్తున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.