అమెరికాలో డ్రగ్స్ డోస్ ఎక్కువ కావడంతో ఓ వివాహిత స్పృహ తప్పి పడిపోయింది. అయితే అప్పటికే ఆమె పక్కన నిల్చుని రెండేళ్ల చిన్నారి. తన తల్లిని లేపేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్ల కంటతడి పెట్టిస్తోంది. అమెరికాలోని లారన్స్ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లారన్స్ అనే ప్రాంతంలో ఫేమిలీ డాలర్ స్టోర్ అనే సూపర్ మార్కెట్ ఉంది.
ఓ వైపు కన్నీళ్లు వస్తున్నా.. పట్టించుకోకుండా తల్లిని లేపుతూ ఆ చిన్నారి పడే తపన అక్కడున్న అందరినీ కంటతడిపెట్టేలా చేసింది. దీంతో షాపు ఓనర్ పోలీసులకు సమాచారమందించారు. చిన్నారిని శిశు సంక్షేమ కేంద్రానికి పంపారు. ఆ మహిళను ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.