జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

దేవీ

సోమవారం, 19 మే 2025 (17:21 IST)
Kritireddy, sai, devisri prasad
కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న మూవీ ‘జూనియర్’. వారాహి చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాధా కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. మేకర్స్ ఇటీవల ప్రకటించిన ప్రకారం ఈ సినిమా జూన్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్‌ కాబోతోంది.
 
ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ ఫస్ట్  సింగిల్ 'లెట్స్ లివ్ దిస్ మోమెంట్' ను విడుదల చేశారు. టైటిల్ లో చెప్పినట్టే, ఎనర్జిటిక్, సెలబ్రేషన్ స్పిరిట్‌తో నిండిపోయింది. జీవితం, ప్రేమ, సంగీతం – అన్నిటినీ కలిపే ఫీలింగ్ తో, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జీ ఈ పాటను మరింత రిచ్ గా కంపోజ్ చేశారు .
 
డీఎస్పీ హై ఎనర్జీతో, ఫుట్ టాపింగ్ బీట్‌లతో పాటను కంపోజ్ చేశారు. ఎలక్ట్రానిక్ మ్యూజిక్‌తో బ్లెండ్ అయిన ఈ ట్యూన్‌లో యువతను ఆకట్టుకునే విబ్రెన్సీ ఉంది. జస్ప్రీత్ జాజ్ వాయిస్ ఈ పాటకి శక్తినిచ్చింది. శ్రీమణి రాసిన సాహిత్యం ఎమోషన కలిగించేలా ఉంది.
 
విజువల్‌గా ఈ పాటలో కిరీటి, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కిరీటి గ్రేస్‌ఫుల్ డాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ పొలాకి రూపొందించిన కొరియోగ్రఫీ అదిరిపోయింది.  కలర్‌ఫుల్ సెట్స్‌పై గ్రాండ్‌గా చిత్రీకరించిన ఈ పాట విజువల్ గా కూడా అద్భుతంగా కనిపిస్తుంది.  
 
ఈ సినిమాతో జెనీలియా మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. అలాగే కన్నడ సినిమా ఐకాన్, క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్రన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అన్ని విభాగాల్లోనూ ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంటిల్ కుమార్ సినిమాకు విజువల్ గ్రాండియర్ అందించగా, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రొడక్షన్ డిజైన్ కోసం రవీందర్, యాక్షన్ కోసం ఇండియా టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హైన్ పని చేశారు. డైలాగ్స్ కల్యాణ్ చక్రవర్తి త్రిపురనేని రాయగా, నిరంజన్ దేవరమనే ఎడిటర్.
 
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఒక లైవ్ కాన్సర్ట్ చేస్తున్న ఆనందం కలిగింది ఈ వేడుక చూస్తుంటే. ఈ సినిమాలో పార్ట్  కావడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ రాధాకృష్ణ గారు సినిమాని చాలా ప్రత్యేకంగా తీశారు. స్క్రిప్ట్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. వెరీ ఎమోషనల్ అండ్ టచ్చింగ్ స్టోరీ. శ్రీమణి గారు చాలా అద్భుతమైన సాహిత్యం రాశారు. ట్యూన్ కి బ్యూటీ ని యాడ్ చేశారు.సెంథిల్ గారు ఈ సినిమాకి వర్క్ చేయడం మరో హ్యాపీ మూమెంట్. ఈ సినిమాకి ఆయన బిగ్గెస్ట్ పిల్లర్. రవిచంద్రన్ గారు ఈ సినిమాల్లో పార్ట్ కావడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. రవిచంద్రన్ గారి తెలుగు చాలా అందంగా ఉంది. తెలుగు వర్షన్ కి ఆయనే డబ్బింగ్ చెప్పాలని కోరుకుంటున్నాను. సాయిగారి బ్యానర్ లో వర్క్ చేయడం ఒక హానర్ గా భావిస్తున్నాను. కిరీటి సినిమా కోసం చాలా అద్భుతంగా ప్రిపేర్ అయ్యారు. తన యాక్షన్ డాన్సింగ్ స్కిల్స్ చాలా సర్ప్రైజ్ చేశాయి. ఫైట్స్ చాలా అద్భుతంగా చేశాడు. తనకి గ్రేట్ ఫ్యూచర్ ఉంటుంది. జెనీలియా ఈ సినిమాతో మళ్ళీ కం బ్యాక్ ఇవ్వడం ఆనందంగా ఉంది. శ్రీలీల అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. ఇందులో ఎనర్జిటిక్ మా సాంగ్ ఉంది. అది మిమ్మల్ని అందరిని మెస్మరైజ్ చేస్తుంది. అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా తప్పకుండా మీ అందరిని అలరిస్తుంది'అన్నారు
 
హీరో కిరీటి రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నా తొలి సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ గారు. లెజెండ్రీ డిఓపి సెంథిల్ గారు నిర్మాత సాయి గారు ఇలా అద్భుతమైన టీం తో కలిసి పని చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. లెజెండరీ యాక్టర్ వి రవిచంద్రన్ గారు ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆయన గురించి మాట్లాడే అంత అనుభవం నాకు లేదు. ఆయనతో కలిసి పనిచేయడం ఒక గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. శ్రీ లీల, జెనీలియా గారు ఈ సినిమాలో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన తెలుగు మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా కాస్త ఆలస్యమైంది దానికి కారణం నాకు షూటింగ్లో జరిగిన ఒక గాయం. దాన్నుంచి కోల్పోవడానికి దాదాపు ఒక ఏడాది పట్టింది. నా ఆరాధ్య దైవం పునీత్ రాజ్ కుమార్ గారు. రేపు జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే. ఎన్టీఆర్ గారికి ఒక అభిమానిగా హ్యాపీ బర్త్డే. ఆయన మాలాంటి ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఈ సినిమాలో ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేశాను. చాలా మంచి సినిమా తీశాం. దేవిశ్రీ గారు నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది'అన్నారు.
 
యాక్టర్ వి రవిచంద్రన్ మాట్లాడుతూ... డైరెక్టర్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. దేవిశ్రీప్రసాద్ గారు వచ్చిన తర్వాత ఎనర్జీ మారిపోయింది. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా వెరీ హ్యాపీ జర్నీ. దేవిశ్రీ సెంథిల్ సాయి గారు ఇలా అద్భుతమైనటువంటి టెక్నీషియన్స్ ఈ సినిమాకి కలిసి రావడం ఆనందంగా ఉంది. చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. సినిమాని చాలా పర్ఫెక్షన్తో తీర్చిదిద్దడం జరిగింది. కిరీటి ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు. కచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయి తనకు మంచి పేరు తీసుకొస్తుంది'అన్నారు  
 
కొరియోగ్రఫర్ విజయ్ పోలకీ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. దేవిశ్రీప్రసాద్ గారి మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. ఆయన ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చారంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్. పుష్ప తర్వాత ఆయనతో కలిసి మళ్ళీ వర్క్ చేస్తున్నాను.సెంథిల్ గారు లెజెండరీ సినిమాటోగ్రాఫర్. బాహుబలి అంటే సినిమాలు చేసిన డిఓపితో కలిసి పనిచేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. వారాహి బ్యానర్ నాకు మొదటి నుంచి ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. అద్భుతంగా సినిమా తీశారు. కిరీటి గారికి సినిమా అంటే చాలా పాషన్. ఆయన డాన్స్ యాక్టింగ్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థాంక్యు
 
డిఓపి సెంథిల్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్, బాహుబలి చేసిన తర్వాత.. ఈ సినిమాతో కన్నడలో డెబ్యు చేయడం ఆనందంగా వుంది.  ఈ సినిమాలో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈ కథ విన్నప్పుడు చాలా నచ్చింది. చాలా ఫ్రెష్ ఫిలిం ఇది.  మంచి ఎమోషన్ ఉంటుంది. సాయి గారికి థాంక్యూ. ఈ సినిమాలలో పాట అవడం చాలా ఆనందంగా ఉంది. కిరీటికి ఇది పర్ఫెక్ట్ లాంచ్. తప్పకుండా భవిష్యత్తులో తను గొప్ప స్థాయికి వెళ్తాడు. దేవి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చాలా మంచి టెక్నికల్ టీం తో ఈ సినిమా చేసాం. దేవిశ్రీప్రసాద్ గారు చేసిన బ్యాగ్రౌండ్ స్కోరు ఈ సినిమాకు చాలా స్పెషల్ గా ఉండబోతుంది. జూన్ 18న అందరం థియేటర్స్ లో కలుద్దాం'అన్నారు  
 
డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. దేవిశ్రీప్రసాద్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ చేయడం ఒన్ ఆఫ్ దిప్రౌడ్  మూమెంట్ ఇన్ మై లైఫ్. లైఫ్ లాంగ్ మెమరీ. ఇందులో ప్రతి సాంగు చాలా స్పెషల్. మరిన్ని అద్భుతమైన పాటలు రాబోతున్నాయి దేవిశ్రీప్రసాద్ గారు సెంథిల్ గారు ఇలా బెస్ట్ టీం తో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో ప్రతిఫ్రేము చాలా స్పెషల్ గా ఉండబోతుంది. ఇది నా రెండో సినిమా. దేవి గారు సెంథిల్ గారు. సాయి గారు ఇలా అందరూ సీనియర్స్ ఉండడం వల్ల మా జూనియర్ సినిమా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందని నమ్ముతున్నాను. జూన్ 18న థియేటర్స్ లో కలుద్దాం'అన్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు