Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

దేవీ

సోమవారం, 19 మే 2025 (16:48 IST)
Vasudeva Sutham Team with Manisarma
ప్రస్తుతం మైథలాజికల్ టచ్ ఇస్తున్న చిత్రాలకు ఎక్కువ డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. గుడి చుట్టూ తిరిగే ఓ కథతో మాస్టర్ మహేంద్రన్ హీరోగా రాబోతోన్నాడు. బేబీ చైత్ర శ్రీ, మాస్టర్ యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల ‘వసుదేవ సుతం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.
 
తాజాగా ‘వసుదేవ సుతం’ సినిమా నుంచి మణిశర్మ చేతుల మీదగా అదిరిపోయే గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. విశ్వాన్ని చూపించడం.. అందులోంచి భూమి.. భూమీ మీదున్న ఓ గుడి.. ఆ గుడిలో ఉన్న పాము.. ఆ తరువాత హీరో ఎంట్రీ ఇలా అన్నీ అదిరిపోయాయి. గుడిలోని నిధి చుట్టూ ఈ కథ తిరిగేలా కనిపిస్తోంది. గ్లింప్స్‌తోనే సినిమా మీద అంచనాల్ని పెంచేశారు.
 
ఈ గ్లింప్స్‌ని మణిశర్మ రిలీజ్ చేస్తూ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇక ఈ గ్లింప్స్‌కు మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకంగా అనిపిస్తుంది. ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ, ఒరియా భాషల్లో రిలీజ్ చేయబోతోన్నారు.
 
తారాగణం : మాస్టర్ మహేంద్రన్, అంబికావాణి, జాన్ విజయ్, మిమ్‌గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఐశ్వర్యలక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్ తదితరులు 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు