పాకిస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నెల రోజుల్లో 147 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 88 మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్టు పాకిస్థాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది.
వర్షాల కారణంగా ఇళ్లు, రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోర్ట్ సిటీ కరాచీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చాలావరకు ప్రాంతాలు నీట మునిగాయి.