డోనాల్డ్ ట్రంప్ ఓ డైనోసార్.. ట్రంప్‌కు భారీ శరీరం, చిన్న తల, చేతులు ఉన్నాయ్: హాలీవుడ్ నటి హెలెన్ మిరెన్
మహిళలపై డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు బహిర్గతం కావడంతో చాలా మంది ప్రముఖులు ఆయనపై విమర్శలు కురిపిస్తున్నారు. వీరిలో తాజాగా ఆస్కార్ అవార్డు విజేత, హాలీవుడ్ హీరోయిన్ హెలెన్ మిరెన్ కూడా చేరిపోయారు. హెలెన్ మిరెన్ ఆయనపై ఎవరూ ఊహించని విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్‌ను డైనోసార్‌గా అభివర్ణించారు.
డైనోసార్ లాగానే ట్రంప్‌కు భారీ శరీరం, చిన్న తల, చేతులు ఉంటాయని చెప్పిన ఆమె డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కే తన మద్దతు ఉంటుందని తెలిపింది. అలాగే హిల్లరీ కోసం ఇటీవల చేపట్టిన విరాళాల సేకరణ కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొన్నారు.