గర్ల్ ఫ్రెండ్‌ను ఆట పట్టించాలనుకున్నాడు. అంతే ఏకంగా కొండచిలువతోనే ఆమెను భయపెట్టాలనుకున్నాడు. ఇంకేముంది.. నిద్రపోతున్న గర్ల్ ఫ్రెండ్ మీద రెండు పెద్ద కొండ చిలువలు తెచ్చి పడేశాడో బాయ్‌ఫ్రెండ్. పైథాన్లు మీద పడేసరికి తన గర్ల్ ఫ్రెండ్ ఎలా స్పందించిందన్న దృశ్యాన్ని తన స్నేహితులతో కలిసి వీడియో తీసి ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో పెట్టాడు డెరెక్ డెస్కో అనే ప్రబుద్ధుడు. ఇది తన ప్రాక్టికల్ జోక్ అని చెప్తున్నాడు.
అయితే ఆ యువతి మాత్రం పైతాన్‌లను చూసి జడుసుకున్నానని, ప్రాణం పోయేంత పనైందని.. ఇలాంటి పనులు ఇంకోసారి చేస్తే అంతేనని బాయ్‌ఫ్రెండ్‌కు వార్నింగ్ ఇచ్చింది. అసలే పాములంటే భయపడే తన గర్ల్ ఫ్రెండ్‌ను ఇలా భయపెట్టి నవ్వుకున్నానని డెరెక్ డెస్కో తెలిపాడు. అయితే తన గర్ల్ ఫ్రెండ్ భయపడిపోయిందని ఎంతసేపైనా ఏడుపును ఆపుకోలేకపోయిందని డెస్కో చెప్పుకొచ్చాడు.