సౌదీలో హౌతీ తిరుగుబాటుదారుల దాడి.. మంటల్లో చిక్కుకున్న పౌర విమానం

గురువారం, 11 ఫిబ్రవరి 2021 (08:24 IST)
సౌదీ అరేబియాలో హౌతీ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. సౌదీ అరేబియాలోని అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన ఈ దాడిలో ఓ పౌర విమానం మంటల్లో చిక్కుకుంది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపకశాఖ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అయితే, ఈ విమానంలోని ప్రయాణికుల పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. 
 
ఈ ఘటనతో విమానాల ట్రాకింగ్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, గతంలో అబా విమానాశ్రయం లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారులు పలుమార్లు క్షిపణిదాడులకు దిగిన విషయం తెల్సిందే. అప్పట్లో ఆ దాడుల్లో పలువురు ప్రయాణికులు గాయపడినా, విమానానికి మంటలు అంటుకోవడం అన్నది మాత్రం ఇదే తొలిసారి.
 
2017లోనూ విమానాశ్రయంపై ఇలాంటి తరహా దాడే జరిగింది. సౌదీలోని చమురు కేంద్రాలపైనా తిరుగుబాటుదారులు దాడులు చేస్తూనే ఉన్నారు. 2015లోనే యెమెన్ రాజధానిని హౌతీ తిరుగుబాటుదారులు ఆక్రమించినప్పటి నుంచి దాడులు పెరిగాయి. అయితే, వారి వెనక ఇరాన్ ఉందన్నది సౌదీ ఆరోపణ. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు