ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ అధికారులతో జరిపే చర్చలకు కాశ్మీర్ అల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ నేతకు అనుమతి ఇచ్చింది. నిజానికి దేశభద్రత దృష్ట్యా ఇన్నాళ్లూ ఈ నేతలకు చర్చల్లో పాల్గొనే అవకాశం ఇవ్వలేదు. కానీ, ఇపుడు గతంలో వ్యతిరేకించిన విధానాన్ని వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ఆ రెండు వర్గాల చర్చలపై రెండేళ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే.సింగ్‌కు వెల్లడించింది.
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. ఆ రాష్ట్రానికి చెందిన సోకాల్డ్ నాయకులు కూడా భారత పౌరులే. కాబట్టి వాళ్లు ఏ దేశానికి చెందిన ప్రతినిధులతోనైనా సమావేశాల్లో పాల్గొనవచ్చు. ద్వైపాక్షిక విధానంలోనే భారత్, పాక్‌ల మధ్య సంవాదాలు కొనసాగుతాయి. మూడో ప్రతినిధి (థార్డ్ పార్టీ) ప్రమేయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం. సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్‌ల అమలులో భాగంగానే భారత్ ఈ విధానాన్ని అనుసరిస్తోంది. దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చొద్దని పాకిస్థాన్‌కు పలుమార్లు విజ్ఞప్తిచేశాం అన్నట్టు తెలిపారు.